Venky Monkey: ప్లీజ్ .. మా ఛాన్సులు పోగొట్టకండి: 'జబర్డస్త్' వెంకీ మంకీ

Venky Monkey Interview

  • కామెడీ షోగా 'జబర్దస్త్' పాప్యులర్ 
  • ఈ వేదిక ద్వారా పేరు తెచ్చుకున్న వెంకీ మంకీ 
  • 'జబర్దస్త్' లేకపోతే తాను లేనని వెల్లడి
  • అనవసర ప్రచారాలు ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన


'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. అలాంటి కమెడియన్స్ లో 'వెంకీ మంకీ' ఒకరు. తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను మిమిక్రీ ఆర్టిస్టును .. అక్కడక్కడా షోస్ ఇస్తూ ఉండేవాడిని. చమ్మక్ చంద్ర చూసి నన్ను 'జబర్దస్త్'కి పరిచయం చేశాడు. కమెడియన్ గా నాకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది" అని అన్నాడు. 

డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాను. స్క్రిప్ట్ రాయడంలో నాకు అనుభవం ఉంది . నటన కూడా కొద్దిగా తెలుసు. అందువలన 'జబర్దస్త్'లో నిలదొక్కుకోగలిగాను. 10 ఏళ్లపాటు టీమ్ లీడర్ గా కొనసాగాను. 'జబర్దస్త్' నాకు జీవితాన్ని ఇచ్చింది. 'జబర్దస్త్' గురించి ఎవరేం మాట్లాడారనేది నాకు తెలియదుగానీ, ఆ షో అన్నం పెట్టి ఆదరించిందనే విషయాన్ని మరిచిపోకూడదు అనేది నా ఉద్దేశం" అని చెప్పాడు.

"చలాకీ చంటి అనారోగ్యం బారిన పడితే, అతని గురించి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్టుగా రాశాయి. ఆ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగితే కూడా అలాగే చేశారు. అందువలన మా ఇంట్లో వాళ్లు చాలా కంగారుపడ్డారు. ఇలాంటి ప్రచారాల వలన, మాకు అవకాశం ఇవ్వాలనుకున్నవాళ్లు ఆలోచిస్తారు. మేం యాక్ట్ చేసే స్థితిలో లేమనుకుని వేరే వాళ్లకు ఆ ఛాన్స్ ఇస్తారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయకండి" అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. 

Venky Monkey
Chammak Chandra
Jabardasth
  • Loading...

More Telugu News