Vangalapudi Anitha: పోలీస్ శాఖకు పూర్వ వైభవం: హోంమంత్రి అనిత

AP Home Minister Amitha Comments on Budget

  • పోలీస్ శాఖకు 2024- 25 బడ్జెట్‌లో రూ.8,495 కోట్ల కేటాయింపు
  • గత ప్రభుత్వ పాలనలో అర కొర సౌకర్యాలతో పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారన్న హోంమంత్రి 
  • రాష్ట్రంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి అనిత

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖకు 2024- 25 బడ్జెట్‌లో రూ.8,495 కోట్లు కేటాయించడం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో అర కొర సౌకర్యాలతో పోలీసులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపట్టిందన్నారు. పోలీసు బలగాల ఆధునికీకరణ, మౌలిక వసతుల కోసం ఇప్పటికే రూ.62 కోట్ల నిధులు విడుదల అయ్యాయన్నారు. 

శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమహేంద్రవరంలో కొత్తగా 4 స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడించిన మాదక ద్రవ్యాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. అందుకే యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ కేసుల సత్వర పరిష్కారానికి 13 ఫాస్ట్ ట్రాక్ ఎన్డీపీఎస్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 

విద్యార్థులను మత్తుకు బానిసలు కాకుండా ఉంచేందుకు ఉన్నత విద్యా సంస్థల్లో 3,172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందితో ఉమెన్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి అనిత తెలిపారు. 

  • Loading...

More Telugu News