Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఊరట.. అజారుద్దీన్‌కు నోటీసులు
- ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ అజారుద్దీన్ హైకోర్టులో పిటిషన్
- ఆధారాలు లేకుండా తన ఎన్నిక చెల్లదంటూ పిటిషన్ వేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన మాగంటి
- ఆయన వ్యాజ్యం కొట్టివేత.. దాంతో సుప్రీంకోర్టుకు మాగంటి
- విచారణ సందర్భంగా హైకోర్టులో పిటిషన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఎన్నిక చెల్లదంటూ భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, తన ఎన్నిక చెల్లదంటూ ఆధారాలు లేకుండా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
కానీ, న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం మాగంటి పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టులో జరిగే విచారణపై స్టే విధించింది. దీంతో పాటు పిటిషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.