sandeep raj: ఓ ఇంటివాడవుతున్న 'కలర్ ఫొటో 'దర్శకుడు

director sandeep raj engagement

  • నటి చాందినితో దర్శకుడు సందీప్ రాజ్ నిశ్చితార్థం
  • సోషల్ మీడియాలో సందీప్ రాజ్ నిశ్చితార్థ ఫోటోలు
  • సందీప్ – చాందినిలకు శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు

'కలర్ ఫోటో' మూవీతో దర్శకుడుగా పాప్యులరైన సందీప్ రాజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి చాందినితో సందీప్ రాజ్ నిశ్చితార్ధ వేడుక సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఈ సందర్భంగా సందీప్ - చాందినిలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి నిశ్చితార్ధ వేడుక విశాఖపట్నంలో జరిగినట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ మొదటి వారంలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం. 'కలర్ ఫోటో' సినిమాలో చాందిని ఓ పాత్ర పోషించింది. ఆ మూవీ నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు తమ ప్రేమను పెద్దలకు తెలియజేయడంతో ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించగా సోమవారం నిశ్చితార్ధం చేసుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన 'కలర్ ఫోటో' మూవీ ఉత్తమ తెలుగు చిత్ర విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది. సందీప్ ప్రస్తుతం రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా మోగ్లీ సినిమా చిత్రీకరిస్తున్నారు. 
 

sandeep raj
engagement
Cine director
Movie News
  • Loading...

More Telugu News