Samantha: నిజజీవితంలో 'అమ్మ' పాత్రపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Heroine Samantha said that She wants to be a mother

  • ఇప్పటికీ అమ్మనవ్వాలని కలలు కంటున్నానన్న అగ్రనటి
  • తల్లిగా ఉండడానికి ఇష్టపడతానని వ్యాఖ్య
  • తల్లిని కావడం ఆలస్యమైందని భావించడం లేదని వెల్లడి   

హీరోయిన్ సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటికీ తల్లిని కావాలని కలలు కంటున్నానని చెప్పింది. అమ్మగా ఉండడానికి ఇష్టపడతానని, తల్లిని కావడం ఆలస్యమైందని తాను భావించడం లేదని ఆమె పేర్కొంది. సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌ ఇటీవలే విడుదలై ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో నదియా సిన్హ్ (కాష్వీ మజ్ముందర్) అనే చిన్నారికి ఆమె తల్లిగా నటించి మెప్పించింది. తన పాత్రపై ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడింది. నిజ జీవితంలో తల్లిగా ఉండడాన్ని మిస్సవుతున్నారా? అని ప్రశ్నించగా ఆమె ఈ విధంగా స్పందించింది.

కాగా సమంత - నాగచైతన్య పెళ్లి 2017లో జరిగింది. అయితే 2021లో వీరు విడిపోయారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం అయింది. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక జరగనుంది.

‘ఇక, సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ నవంబర్ 7న విడుదలైంది. సమంతతో పాటు వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. 

Samantha
Naga Chaitanya
Tollywood
Movie News
  • Loading...

More Telugu News