IAS: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ

Telangana govt transfers IAS officers

  • టూరిజం, కల్చరల్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్
  • జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి
  • ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో తాజాగా 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి, ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్, రవాణా శాఖ కమిషనర్ గా సురేంద్ర మోహన్ ను నియమించారు.

ఆరోగ్యశ్రీ సీఈవోగా శివశంకర్, పంచాయతీరాజ్ డైరెక్టర్ గా సృజన, ఆయుష్ డైరెక్టర్ గా చిట్టెం లక్ష్మి, ఇంటర్ విద్య డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య, కార్మిక శాఖ కమిషనర్ గా సంజయ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ గా హరికిరణ్ లను నియమిస్తూ నేడు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

IAS
Transfer
Telangana
  • Loading...

More Telugu News