Dil Raju: ‘దిల్ రాజు డ్రీమ్స్’ నెరవేరుతాయా?

Will Dil Rajus Dreams come true

  • మరో కొత్త బ్యానర్‌కు 'దిల్‌' రాజు శ్రీకారం 
  • కొత్త వారికి అవకాశాలు ఇస్తానంటున్న దిల్‌ రాజు 
  • త్వరలోనే వెబ్‌సైట్‌ కూడా ప్రారంభం 

కెరీర్‌ ప్రారంభంలో నిర్మాతగా, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నవ్యమైన ఆలోచనలతో సినిమాలు తీసే నిర్మాత దిల్‌ రాజు గత కొంత కాలంగా కమర్షియల్‌ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన ఇటీవల తాను ట్రాక్‌ తప్పానని కూడా ప్రకటించాడు. ఇప్పుడు తన కెరీర్‌ మొదలులో మిస్‌ అయిన ఆ ఫ్రెష్‌ కంటెంట్‌ను మళ్లీ ప్రేక్షకులకు అందించడానికి, కొత్తవాళ్లను ప్రోత్సహించడానికి ఈ అభిరుచి గల నిర్మాత 'దిల్‌ రాజు డ్రీమ్స్‌'  పేరిట మరో నూతన సంస్థకు శ్రీకారం చుట్టాడు. 

సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ విశేషాలను తెలియజేశారు. 'దిల్‌' రాజు మాట్లాడుతూ ''నూతన ప్రతిభను గుర్తించి ఎంకరేజ్‌ చేయడానికి 'దిల్‌ రాజు డ్రీమ్‌' బ్యానర్‌ను స్థాపించాను. త్వరలోనే దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అన్ని విషయాను పొందుపరుస్తాం. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ కంటెంట్‌ మా సంస్థ టీమ్‌కు చేరుతుంది. ఇందుకోసం వారంలో ఒకరోజు కేటాయించి ఈ కథలు నేను కూడా వింటాను. ఏడాదికి నాలుగైదు సినిమాలు మాత్రమే ఇందులో చేయాలని నిర్ణయించుకున్నాం. 

ఈ క్రమంలో ఎలాంటి రికమండేషన్స్‌ పనిచేయవు. కేవలం టాలెంట్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరైనా సరే వెబ్‌సైట్‌ ద్వారానే మా టీమ్‌ను సంప్రదించాలి. ఇరవై నిమిషాల స్రిప్ట్‌ను అందులో పెట్టాలి. అందులో మా టీమ్‌కు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకుని వారంలో ఒకరోజు నేను వింటాను" అన్నారు. 

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు తన మనసుకు నచ్చిన క్యూట్‌ కథలను కూడా ఈ బ్యానర్‌లో తెరకెక్కించి దిల్‌ రాజు తన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవడంతో పాటు ఔత్సాహిక నటీనటులను, దర్శకులను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే ఈ ఆలోచన అభినందనీయమే. సో.. దిల్‌ రాజు డ్రీమ్స్‌ నేరవేరాలని మనం కూడా కోరుకుందాం..! 

Dil Raju
Dil raju new movies
Cinema
Tollywood
Game changer
  • Loading...

More Telugu News