Vamsi Ramaraju: రాజబాబుగారు గుర్తొస్తే బాధపడతాను... కారణం అదే: వంశీ రామరాజు

Vamsi Ramaraju Interview

  • ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజబాబు 
  • ఎంతోమందికి సాయం చేశారన్న వంశీ రామరాజు 
  • ఆయన బర్త్ డే వేడుక చేయలేకపోయానని వెల్లడి 
  • అప్పటి నుంచి పిరికితనం వదిలేశానని వివరణ


రచయితగా... దర్శకుడిగా వంశీ రామరాజు ప్రయాణం సుదీర్ఘం. చాలా చిన్న వయసులోనే కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, అలనాటి తారలతో ఎంతో చనువుగా మసలుకునేవారు. తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన రాజబాబు గురించి ప్రస్తావించారు. రాజబాబుతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

"ఒకానొక సమయంలో రాజబాబుగారిని కలుసుకోవడమే కష్టంగా మారిపోయింది. ఆయన అంత బిజీగా ఉండేవారు. ఎంతోమందికి ఆయన దానధర్మాలు చేశారు. అడిగినవారికి లేదనకుండా సాయం చేశారు. అలాంటి ఆయన ఆ తరువాత కాలంలో మద్యానికి అలవాటు పడ్డారు. ఒకానొక సమయంలో ఆయన మా ఇంటికి ఆటోలో వచ్చారు. అది చూసి నేను షాక్ అయ్యాను. అప్పటికే ఆయన చాలా పాడైపోయారు" అని అన్నారు. 

"ఆర్టిస్టుల బర్త్ డే సందర్భంగా అప్పట్లో నేను సన్మానాలు... సత్కారాలు చేసేవాడిని. తన బర్త్ డే వేడుకను కూడా జరపమని ఆయన నన్ను అడిగారు. అలాగే చేద్దామని నేను అన్నాను. అయితే ఒక సంఘటన కారణంగా నేను ఆయనకి ఫంక్షన్ చేయలేకపోయాను. కారణం ఏమిటనేది గ్రహించిన ఆయన, ఇక నన్ను అడిగే ప్రయత్నం చేయలేదు. ఆ సంఘటన నన్ను ఇప్పటికీ బాధిస్తూ ఉంటుంది. ఆ సంఘటన నుంచి నేను మొహమాటం... పిరికితనం వదిలేశాను" అని చెప్పారు.

Vamsi Ramaraju
Writer
Rajababu
Actor
  • Loading...

More Telugu News