Ravi Kale: ఎవరు మనవాళ్లు? కష్టాలను మించిన పాఠాల్లేవ్: నటుడు రవి కాలే!

Ravi Kale Interview

  • వివిధ భాషా చిత్రాల్లో నటించిన రవి కాలే 
  • 'దృశ్యం'తో తెలుగువారికి చేరువైన నటుడు
  • ఆర్ధిక ఇబ్బందులు పడ్డానని వెల్లడి
  • బంధువులెవరూ పట్టించుకోలేదని ఆవేదన


రవి కాలే... వివిధ భాషల్లో దాదాపు 300 సినిమాలలో నటించిన నటుడు. ఆయన పేరు కంటే కూడా, 'దృశ్యం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ అంటే వెంటనే గుర్తుకు వస్తాడు. 'దండుపాళ్యం' ఫేమ్ అని చెప్పినా కనులముందు కదలాడతాడు. మొరటుగా కనిపిస్తూ... బేస్ వాయిస్ తో మెప్పించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించి అనేక విషయాలను పంచుకున్నాడు.

"నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉండేవి. జీవితమే ఒక పోరాటమైనప్పుడు ఇలాంటి గాయాలు అవుతూనే ఉంటాయని అనుకునేవాడిని. అప్పట్లో డబ్బులు ఉండేవికాదు... అందువలన చాలా ఇబ్బందులు పడేవాడిని. ఎక్కడికైనా సరే ఎక్కువగా నడిచే వెళుతూ ఉండేవాడిని. రెండు పూటలా అన్నం తినేవాడిని... టి కూడా తాగేవాడిని కాదు. పండుగ వస్తే బంధువుల ఇళ్లకి వెళ్లి పిండివంటలు తినొచ్చు... ఉల్లాసంగా గడపొచ్చునని అనుకునేవాడిని" అని చెప్పారు. 

"మా బంధువులు మా సొంత ఊరు వస్తే వాళ్లను మా అమ్మ ఎంతో ప్రేమగా చూసేది. ఎన్నో రకాల వంటలు చేసిపెట్టేది. వాళ్ల ఇంటికి వెళితే నన్ను కూడా అలాగే చూస్తారని అనుకున్నాను. కానీ తమ మధ్య గొడవ జరిగినట్టుగా నటించి... చిరాకుతో ఉన్నట్టుగా కనిపిస్తూ, నన్ను వెళ్లిపొమ్మనేవారు. అప్పుడు నేను ఆకలితో తిరిగొచ్చి గార్డెన్ లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరు మనవాళ్లు? అని నాకు అప్పుడే అనిపించింది. కష్టాలే నాకు పాఠాలు నేర్పాయి... అవమానాలే నన్ను అభివృద్ధిలోకి తెచ్చాయి" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

  • Loading...

More Telugu News