Surya: 'కంగువా' కోలీవుడ్ కొత్త రికార్డును సెట్ చేయనుందా?

Kanguva Movie Update

  • సూర్య తాజా చిత్రంగా 'కంగువా'
  • విజువల్ వండర్ గా రెడీ చేస్తున్న శివ 
  • కీలక పాత్రల్లో జగపతి బాబు - బాబీ డియోల్
  • ఈ నెల 14న పాన్ ఇండియా రిలీజ్ 
  • 1000 కోట్ల వసూళ్లు ఖాయమంటున్న ఫ్యాన్స్


ఇప్పుడు బాలీవుడ్ .. టాలీవుడ్ .. కోలీవుడ్ .. ఇలా ఎక్కడ చూసినా, సీనియర్ స్టార్ హీరోలు ప్రయోగాల వైపు వెళుతుండటం కనిపిస్తోంది. తాము ఎంచుకున్న కంటెంట్ వలన తెరపై కొత్తగా కనిపించడానికి ఆసక్తిని చూపుతున్నారు. తమ కెరియర్లో ఎప్పటికీ మిగిలిపోయే అద్భుతమొకటి చేరిపోవాలని ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. చరిత్ర .. పౌరాణికం .. సైన్స్ ఫిక్షన్ .. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా, దానిని విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ తరహా కథలను నిర్మించడానికి వందల కోట్లను ఖర్చు చేయడానికి మేకర్స్ వెనుకాడటం లేదు. ప్రపంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులో ఉండటం వలన సాహసాలు చేయడానికి భయపడటం లేదు. అలా రూపొందిన సినిమాలలో 'కంగువా' ఒకటిగా కనిపిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను, స్టూడియో గ్రీన్ - యూవీ బ్యానర్లు కలిసి నిర్మించాయి. ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14న థియేటర్లకు రావడానికి ముస్తాబవుతోంది. 

శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. జగపతిబాబు ..  బాబీ డియోల్ .. దిశా పటాని .. యోగిబాబు .. కోవై సరళ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సూర్య కెరియర్ లోనే కాదు, తమిళనాట కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుందనే టాక్ వినిపిస్తోంది. 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ స్థాయిని ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి మరి. 

Surya
Disha Patani
Bobby Deol
Jagapathi Babu
  • Loading...

More Telugu News