Anika Surendran: లవ్ స్టోరీస్ జోరు తగ్గినట్టేనా?

Teenage Love Stories

  • ఒకప్పుడు ప్రేమకథలదే పైచేయి 
  • నిదానంగా తగ్గుతూ వస్తున్న లవ్ స్టోరీస్ 
  • మరింత దూరమవుతున్న టీనేజ్ ప్రేమకథలు
  • యూత్ ను నిరాశపరిచే విషయమే ఇది


వెండితెరపై నిన్నమొన్నటి వరకూ ప్రేమకథలు రాజ్యమేలాయి. చాలామంది హీరోలు ప్రేమకథలతోనే తెరకి పరిచయమయ్యారు. సినిమాలు చూసేవారిలో యూత్ ఎక్కువ. వాళ్లకి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీస్ చేస్తే, మినిమమ్ వసూళ్లు ఎక్కడికీ పోవు అనే ఒక నమ్మకం మేకర్స్ కి ఉండేది. ఇక లవర్ బాయ్ అనే ఇమేజ్ సంపాదించుకున్న హీరోలు, చాలా కాలం పాటు అదే ట్రాక్ లో తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. 

ప్రేమ .. గీతాంజలి .. అభినందన .. వంటి ప్రేమకథలు ఇప్పుడు రావడం లేదు. ఒకవేళ అలాంటి కథలను తీయాలనుకున్నా, అందుకు తగిన హీరోలు .. హీరోయిన్స్ లేని ఒక చిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇప్పటి కథల్లోను ప్రేమ ఉంది .. కానీ ప్రేమ చుట్టూ తిరిగే కథ కనిపించక చాలా కాలమే అయింది. శ్రీకాంత్ తనయుడు ఎంట్రీ ఇచ్చాక, ఒక మంచి టీనేజ్ లవర్ దొరికాడని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే అతను చదువు కోసం గ్యాప్ తీసుకున్నాడు.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, 'బుట్టబొమ్మ'తో పరిచయమైన అనిక సురేంద్రన్ ను చూసి, లవ్ స్టోరీస్ కి ఒక మంచి బ్యూటీ దొరికింది అనిపించింది. కానీ ఎందుకో ఈ అమ్మాయి తమిళ సినిమాలపైనే ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్రకు టీనేజ్ అమ్మాయిగా కనిపించిన 'సారా అర్జున్' కూడా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. థ్రిల్లర్ జోనర్ ను దాటుకుని లవ్ స్టోరీస్ ముందుకు వెళ్లడం కష్టంగానే ఉంది. ఇక అలాంటి కంటెంట్ కి హీరో హీరోయిన్స్ ను వెతికి పట్టుకోవడం మరింత కష్టంగా ఉండటమే విచారకరం. 

  • Loading...

More Telugu News