Sai Pallavi: సాయిపల్లవి చేసిందీ అంటే అది హిట్టేనట!

Sai Pallavi Special

  • 'అమరన్'తో హిట్ కొట్టిన సాయిపల్లవి
  • ఆమె నటనకి ప్రశంసల వెల్లువ
  • తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లు 
  • తెలుగులో చైతూ జోడిగా చేసిన 'తండేల్'
  • ఫిబ్రవరి 7వ తేదీన విడుదల


సాయిపల్లవి .. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ పేరుకు ఎంతో క్రేజ్ ఉంది. జీవితానికి దగ్గరగా అనిపించే కథలను ఆమె ఇష్టపడుతుంది. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటుంది. ఇక డాన్స్ విషయంలో ఆమెకి వంక బెట్టవలసిన పనిలేదు.  సాయిపల్లవి అందుకునే పారితోషికం తక్కువేమీ కాదు. కానీ కథ - తన పాత్ర నచ్చితేనే తప్ప ఆమె చేసే రకం కాదు. అందువల్లనే ఆమె కెరియర్లో ఎక్కువగా హిట్స్ కనిపిస్తాయి.

అలాంటి సాయిపల్లవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'అమరన్' వచ్చింది. శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, మేజర్ 'ముకుంద్ వరదరాజన్' జీవితచరిత్రగా రూపొందింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది భారీ వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. హీరో చుట్టూ కథ తిరిగినప్పటికీ, సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎప్పటిలానే ఆమెకి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకి కమల్ ఒక నిర్మాత కావడం మరో విశేషం.

'అమరన్' సాధించిన సక్సెస్ ను ఆమె ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆమె ఒక సినిమా చేసిందీ అంటే అది హిట్టేనని తెలుగు .. తమిళ అభిమానులు చెప్పుకుంటున్నారు. తెలుగులో చైతూ జోడీగా రీసెంటుగా ఆమె చేసిన సినిమానే 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లకు రానుంది. శ్రీకాకుళానికి చెందిన ఒక జాలరి కథ ఇది. ప్రేమకథ - దేశభక్తి ప్రధానంగా కనిపించే ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Sai Pallavi
Shiva Karthikeyan
Amaran
Thandel
Naga Chaitanya
  • Loading...

More Telugu News