YSRCP: ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు... వైసీపీ ఎమ్మెల్యేలు దూరం

YCP MLAs not attended to Budget session

  • అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
  • వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు
  • మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొల్లు రవీంద్ర

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దాదాపు రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. 

బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.

YSRCP
Telugudesam
AP Assembly Session
Andhra Pradesh
  • Loading...

More Telugu News