TTD: ఈ నెల 18న‌ టీటీడీ నూతన పాలకమండలి సమావేశం

TTD Board will meet on Nov 18

  • ఇటీవల టీటీడీ పాలకమండలిని నియమించిన కూటమి ప్రభుత్వం
  • 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో బోర్డు
  • చైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం
  • తొలిసారిగా సమావేశమవుతున్న టీటీడీ నూతన పాలకమండలి

ఏపీ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కూడిన టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేశారు. టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు (బొల్లినేని రాజగోపాల్ నాయుడు) చైర్మన్ గా నియమితులయ్యారు. 

ఈ నేపథ్యంలో, టీటీడీ నూతన పాలకమండలి నవంబరు 18న తొలిసారిగా సమావేశంగా కానుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఉదయం 10.15 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

TTD
New Board
BR Naidu
Tirumala
  • Loading...

More Telugu News