Big boss 8: బిగ్ బాస్ లో జంబలకిడి పంబ.. తాజా ప్రోమో ఇదిగో!

Big boss latest Promo video

  • కంటెస్టెంట్ల డ్రెస్సింగ్ చూసి నాగార్జున షాక్
  • ఈ వారం హౌస్ ను వీడనున్న హరితేజ?
  • శనివారం గంగవ్వను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ జంబలకిడిపంబగా మారిపోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. హౌస్ లోని అబ్బాయిలంతా అమ్మాయిల డ్రెస్సుల్లో, అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సుల్లో కనిపించారు. గెటప్ మారిన కంటెస్టెంట్లను చూసి నాగార్జున షాక్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున కోరిక మేరకు ముక్కు అవినాశ్, విష్ణుప్రియలు చిన్న స్కిట్ చేసి ప్రేక్షకులను అలరించడం ఇందులో చూడొచ్చు. పృథ్వీతో ఉన్నపుడు విష్ణుప్రియ ఎలా యాక్ట్ చేస్తుందో చూపించాలని నాగార్జున అడగగా.. విష్ణుప్రియలా ముక్కు అవినాశ్ నటించడంతో మిగతా కంటెస్టెంట్లతో పాటు నాగార్జున కూడా నవ్వాపుకోలేకపోయారు. 

కాగా, పదో వారంలోకి ఎంటరైన ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మరికాసేపట్లో తేలిపోనుంది. ఈ వారం హరితేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని సమాచారం. శుక్రవారం నాటికి పోలైన ప్రేక్షకుల ఓట్లలో హరితేజనే అట్టడుగున ఉంది. దీంతో హరితేజ ఎలిమినేషన్ ఖాయమని తెలుస్తోంది. మరోవైపు, ఆరోగ్యం సహకరించడంలేదంటూ గంగవ్వ విజ్ఞప్తి చేయడంతో నాగార్జున ఆమెను శనివారం ఇంటికి పంపించారు.

Big boss 8
Viral Videos
Mukku Avinash
Sunday Promo
Big boss Eliminations

More Telugu News