Telangana Spice Kitchen: జూబ్లీహిల్స్‌లోని ‘తెలంగాణ స్పైస్ కిచెన్’ హోటల్‌లో భారీ పేలుడు

Huge Blast In Jubilee Hills Telangana Spice Kitchen Hotel
  • పెద్ద శబ్దంతో పేలిన హోటల్‌లోని ఫ్రిజ్ కంప్రెషర్
  • రాళ్లు ఎగిరిపడి దుర్గాభవానీ నగర్ బస్తీలోని నాలుగు గుడిసెలు ధ్వంసం
  • రాళ్లు తగిలి ఓ మహిళకు గాయాలు    
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్‌లో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. హోటల్‌లోని రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పెద్ద శబ్దంతో పేలింది. దీంతో హోటల్ ప్రహరీ ధ్వంసమైంది. రాళ్లు ఎగిరి వంద మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడడంతో నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి.  విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాళ్లు తగిలి ఓ మహిళ గాయపడింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, హోటల్‌ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Spice Kitchen
Jubilee Hills
Hyderabad

More Telugu News