Telangana: వచ్చే సంవత్సరానికి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
![TG announces holidays for 2025 year](https://imgd.ap7am.com/thumbnail/cr-20241109tn672f4bbf3120d.jpg)
- 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
- జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
2025 ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల (ఆప్షనల్ హాలిడేస్) జాబితాను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
![](https://img.ap7am.com/froala-uploads/20241109fr672f4b827192c.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20241109fr672f4b94cc91d.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20241109fr672f4baa10838.jpg)