Surya: అన్ స్టాపబుల్ 4: సూర్య ఫస్టు క్రష్ ఎవరో చెప్పిన కార్తి!

Surya Interview

  • 'అన్ స్టాపబుల్ సీజన్ 4'లో సూర్య
  • కార్తితో అనుబంధాన్ని గురించి ప్రస్తావన 
  • జ్యోతిక తన ఫ్రెండ్ .. ఫిలాసర్ అని వ్యాఖ్య 
  • ఆమె తాను చేసుకున్న అదృష్టమని వెల్లడి


'ఆహా'లో 'అన్ స్టాపబుల్' సీజన్ 4 జోరుగా దూసుకెళుతోంది. దుల్కర్ సల్మాన్ తరువాత ఈ షోను సూర్యతో చేశారు. నిన్నటి నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. తన అసలు పేరు శరవణన్ అనీ .. ఆ తరువాత సూర్యగా మార్చారని సూర్య చెప్పారు. తాను 'అగరం' అనే పేరుతో ఒక ఫౌండేషన్ ను స్థాపించాననీ, ఆ సంస్థ ఇంతవరకూ 6 వేలమంది పేద విద్యార్థులకు సాయాన్ని అందించిందని అన్నారు. 

ఈ సమయంలోనే ఫస్టు క్రష్ ఎవరో చెప్పమని సూర్యను బాలయ్య అడిగారు. ఎవరనేది చెప్పనుగానీ, 14 ఏళ్ల వయసులో ఫస్టు క్రష్ కలిగిందని సూర్య అన్నాడు. దాంతో నేరుగా కార్తీకి కాల్ చేసిన బాలయ్య, సూర్య ఫస్టు క్రష్ ఎవరన్నది చెప్పమని అడిగారు. 'జెంటిల్ మెన్' సినిమాలోని 'చికుబుకు చికుబుకు రైలే' సాంగ్ చూసిన దగ్గర నుంచి గౌతమి ఆయన క్రష్' అని కార్తి నవ్వేశాడు. దాంతో సూర్య కూడా సరదాగా నవ్వేస్తూ, తన తమ్ముడు కార్తి ఈ షోకి వచ్చినప్పుడు తనకి కాల్ చేయమని బాలయ్యను రిక్వెస్ట్ చేశారు.  

ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిక గురించి సూర్య ప్రస్తావించారు. తాము ఎప్పుడూ ఐ లవ్ యూ చెప్పుకోలేదనీ, ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని గ్రహించి పెళ్లి చేసుకున్నామని అన్నాడు. జ్యోతిక లేకుండా తాను తన జీవితాన్ని ఊహించుకోలేనని చెప్పారు. ఆమె తన అదృష్టమనీ, తన ఫ్రెండ్... గైడ్... ఫిలాసఫర్ అంటూ కితాబునిచ్చారు. తమ ఫ్యామిలీలోని అందరికి జ్యోతిక ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు.

Surya
Jyothika
karhi
Balakrishna
Un Stoppable
  • Loading...

More Telugu News