MS Dhoni: థాయ్​లాండ్‌లో ధోనీ ఫ్యామిలీ ట్రిప్​.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను షేర్ చేసిన కూతురు!

MS Dhoni Relax At Thailand Beach

  • థాయ్‌లాండ్‌ బీచ్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేసిన‌ ధోనీ
  • ఈ ట్రిప్ తాలూకు ఫొటోలను పంచుకున్న‌ మ‌హీ గారాల‌ప‌ట్టి జివా సింగ్ 
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మ‌హీ ఫొటోలు

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో త‌న విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్‌డీ ఫ్యామిలీతో క‌లిసి థాయ్‌లాండ్‌కు ఫారిన్ ట్రిప్‌కు వెళ్లాడు. అక్క‌డి బీచ్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ తాలూకు ఫొటోలను మ‌హీ గారాల‌ప‌ట్టి జివా సింగ్ సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

ఈ ఫొటోల్లో ధోనీ బీచ్‌లో రిలాక్స్ అవుతున్నట్టు కనిపించాడు. ఆయ‌న బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంటే... జివా ఒడ్డున నిలబడి తన తండ్రిని చూస్తూ అలలతో ఆడుకుంటోంది. కళ్లద్దాలు ధరించిన ధోనీ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అలాగే సన్‌సెట్ ఫొటోలను కూడా జీవా త‌న‌ ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఇదిలాఉంటే... జివాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ చిన్నారి ఖాతాను ఏకంగా 28 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె తన ఫొటోలన్నింటినీ కూడా ఈ ఖాతా ద్వారానే షేర్ చేస్తుంటుంది. కాగా, ఈ ఖాతా తన తల్లి సాక్షి సింగ్ పర్యవేక్షణ‌లో ఉంటుంద‌ట‌.

View this post on Instagram

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni)

MS Dhoni
Thailand
Team India
Cricket
  • Loading...

More Telugu News