: శ్రీశాంత్ కు అనుకోని ఓదార్పు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో కుమిలిపోతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు అనుకోని ఓదార్పు లభించింది. తొలుత శ్రీశాంత్ ను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోగానే.. ఈ యువ క్రికెటర్ మనువాడబోయే అమ్మాయి కుటుంబం పెళ్ళి ప్రతిపాదన విరమించుకుందని వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ జరగలేదు. పైగా, జైల్లో ఉన్న శ్రీశాంత్ కు స్వాంతన చేకూరేలా వారు ఓదార్పు సందేశాలు పంపారు. అంతేగాకుండా, వివాహం గురించి వచ్చే సెప్టెంబర్లో రెండు కుటుంబాలు చర్చించి నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు.

ఇక టీమిండియా ఈ ఏడాది చివరల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనుండగా, ఆ తర్వాతే శ్రీ పెళ్ళి చేయాలని వారు అనుకుంటున్నారు. ఈ కేరళ ఎక్స్ ప్రెస్ కు భారత జట్టులో చోటు దక్కుతుందని వారు భావిస్తుండడమే అందుకు కారణం. కాగా, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్ పీకల్లోతు కూరుకుపోయినా, పెళ్ళికూతురు మాత్రం అతని పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తోందని ఈ క్రికెటర్ కుటుంబ సభ్యులొకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News