YS Sharmila: అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయండి: షర్మిల

Sharmila comments on jagan

  • ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • విపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం అన్న జగన్
  • అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో ఉండడం ఎందుకున్న షర్మిల

మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ఏం ఉపయోగం అంటూ జగన్ పేర్కొనడంపై షర్మిల స్పందించారు. 

అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనివారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అది జగన్ అయినా, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలైనా... అసెంబ్లీకి వెళ్లే ఆలోచన లేనప్పుడు పదవుల నుంచి తప్పుకోవాలని సూచించారు. 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి జరగనుండడం తెలిసిందే.

YS Sharmila
Jagan
AP Assembly Session
Congress
YSRCP
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News