TS High Court: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు... విచారణ వాయిదా వేసిన హైకోర్టు

HC adjounred disqualification case

  • బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు
  • బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మోహన్ రావు
  • తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు

బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టుకు తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ విచారణకు అర్హమైనది కాదన్నారు. అనర్హత పిటిషన్లపై సభాపతి సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు.

ఈ సందర్భంగా పలు కోర్టుల తీర్పులను మోహన్ రావు ప్రస్తావించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లారు.

TS High Court
Telangana
BRS
Congress
  • Loading...

More Telugu News