CJI Chandrachud: రేపటి నుంచి తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం!: వీడ్కోలు సందర్భంగా సీజేఐ చంద్రచూడ్

DY Chandrachud Last Working Day

  • చంద్రచూడ్‌కు ఈరోజే చివరి పనిదినం
  • ఘనంగా వీడ్కోలు పలికిన సుప్రీం ధర్మాసనం
  • వృత్తిపరంగా తాను సంతృప్తి చెందానన్న చంద్రచూడ్

రేపటి నుంచి తాను సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్నది వాస్తవం... అయితే తాను వృత్తిపరంగా మాత్రం చాలా సంతృప్తి చెందానని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. ఆయనకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‌కు ఈరోజు చివరి పనిదినం. ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైన విషయం తెలిసిందే. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గతంలోనే వెల్లడించారు. 2025 మే 13 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.

CJI Chandrachud
India
Supreme Court
  • Loading...

More Telugu News