Revanth Reddy: రేవంత్ రెడ్డికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

Pawan Kalyan and Chandrababu greets Revanth Reddy

  • ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ నేతలు
  • రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానన్న పవన్
  • రేవంత్ రెడ్డికి బీజేపీ నేత ఖుష్బూ పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు... మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తెలంగాణను మరింత సుభిక్షంగా నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

దేవుడు మీకు ఆనందం, ఆరోగ్యం, విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నానంటూ బీజేపీ నేత ఖుష్బూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇదిలా ఉండగా, ఈరోజు మూసీ పునరుద్ధరణ కోసం పాదయాత్ర చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేదాశీర్వాదం, తీర్థప్రసాదాలు అందించారు.

Revanth Reddy
Chandrababu
Pawan Kalyan
Congress
  • Loading...

More Telugu News