AP Police: ఏపీలో ఏడుగురు అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి.. డీజీపీకి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీలు

ips status for seven senior sps

  • నాన్ కేడర్ ఎస్పీలుగా ఉన్న బి ఉమామహేశ్వరరావు, జే రామమోహనరావు, ఎన్ శ్రీదేవిరావు, ఇ.జి.అశోక్ కుమార్, ఎ.రమాదేవిలను 2022 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా పదోన్నతి
  • కేజీబీ సరిత, కె. చక్రవర్తిలను 2023 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా కన్ఫర్డ్
  • డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి కృతజ్ఞతలు తెలిపిన కన్ఫర్డ్ ఐపీఎస్‌లు

రాష్ట్ర పోలీస్ సర్వీస్‌కు చెందిన ఏడుగురు అధికారులను ఐపీఎస్‌లుగా కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ కేడర్ ఎస్పీలుగా ఉన్న బి.ఉమామహేశ్వరరావు, జె.రామమోహనరావు, ఎన్.శ్రీదేవిరావు, ఇ. జి. అశోక్ కుమార్, ఎ. రమాదేవిలను 2022 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా, కేజీబీ సరిత, కె.చక్రవర్తిలను 2023 బ్యాచ్‌లో ఐపీఎస్‌లుగా కేంద్ర హోంశాఖ కన్ఫర్డ్ చేసింది. ఈ నేపథ్యంలో వీరు అందరూ గురువారం డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

AP Police
DGP Dwaraka Tirumalarao
IPS
  • Loading...

More Telugu News