Revanth Reddy: 'ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి' పుస్తకాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్

TPCC chief launches Oke Okkadu book on Revanth Reddy

  • రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగిన వ్యక్తి అని ప్రశంస
  • రేవంత్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో 'ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి' పుస్తకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత వేణుగోపాల్ రెడ్డి రాశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడు అన్నారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బంధ పాలన చేస్తున్న కేసీఆర్‌పై పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.

రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'ఒకే ఒక్కడు...' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. టీపీసీసీ తరఫున మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డి నిండ నూరేళ్లు జీవించాలని... సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు.

పూరీ బీచ్ లో రేవంత్ రెడ్డి సైకత శిల్పం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని వేసి ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తన అభిమానాన్ని చాటుకున్నారు.

Revanth Reddy
Mahesh Kumar Goud
Congress
Telangana
  • Loading...

More Telugu News