Jobs: ఐడీబీఐ బ్యాంకులో 1000 పోస్టుల భర్తీ.. వివరాలు ఇదిగో!

IDBI Job Notification

  • ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఈ నెల 16 తో ముగియనున్న దరఖాస్తు గడువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న 1,000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలలో నియమించనున్నట్లు తెలిపింది. బ్యాంకు అధికారికి వెబ్ సైట్ ద్వారా ఈ నెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250 ఫీజు చెల్లించాలని పేర్కొంది.

అర్హతలు..
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ఇలా..
తొలి దశలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి ఏడాది నెలకు రూ. 29,000, రెండో ఏడాది నుంచి నెలకు రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

Jobs
Job Notifications
IDBI Bank
Bank Jobs
  • Loading...

More Telugu News