allu aravind: సాయిపల్లవి నా బిడ్డ లాంటిది: అల్లు అరవింద్

allu aravind sai pallavi is like my own daughter

  • తండేల్ మూవీ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు
  • సాయి పల్లవి నటనకు ప్రశంసలు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అల్లు అరవింద్ వ్యాఖ్యలు

ఫిదా మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన నటన, డ్యాన్స్ నైపుణ్యంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల వరుసలో సాయి పల్లవి చేరిపోయింది. కథ ప్రాధాన్యం ఉన్న మూవీలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయి పల్లవి గురించి నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా వున్నాయి. 
 
రీసెంట్‌గా సాయి పల్లవి నటించిన 'అమరన్' మూవీ చూశానని, మూవీ చూసి బయటకు వచ్చే సమయంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయని అల్లు అరవింద్ అన్నారు. సినిమా చివరిలో ఉన్న సీన్‌లో సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసిందన్నారు. తాను సాయి పల్లవిని ఎప్పుడూ సొంత కూతురులా చూస్తానని, తనకు కూతురు ఉంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుందన్నారు. దాంతో తాను మూవీ చూసి బయటకు రాగానే సాయిపల్లవికి కాల్ చేసి ప్రశంసించినట్లు తెలిపారు. 

allu aravind
Sai Pallavi
Movie News
  • Loading...

More Telugu News