Pushpa 2: 'పుష్ప-2' ఖాతాలో మరో రికార్డు

Another record on account of Pushpa 2

  • ఓవర్సీస్‌ టిక్కెట్ల సేల్స్‌లో 'పుష్ప-2'  కొత్త రికార్డు 
  • సంబరాల్లో అల్లు అర్జున్‌ అభిమానులు 
  • విడుదల తరువాత మరిన్ని రికార్డులు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్‌  

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కలయికలో రాబోతున్ననాలుగో చిత్రం 'పుష్ప-2 ది రూల్‌'. ఇంతకు ముందు వీరి కలయిలో వచ్చిన ఆర్య, ఆర్య-2, పుష్ప ఎలాంటి ఘనవిజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాల్లో 'పుష్ప ది రైజ్‌' అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాదు కెరీర్ పరంగా బన్నీని ఒకేసారి వంద మెట్లు ఎక్కించింది. 

70 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఊరిస్తూ వచ్చిన ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారం కూడా 'పుష్ప ది రైజ్‌'  చిత్రంతో అల్లు అర్జున్‌ను వరించింది. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప ది రైజ్‌ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'పుష్ప-2' ది రూల్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు. 

రష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఒకరోజు ముందు డిసెంబర్‌ 4న విడుదల కానుంది.  అయితే ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పిన పుష్ప-2 చిత్రం తన రికార్డుల ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 

అత్యంత వేగంగా 15 వేల టికెట్లు సేల్‌ అయినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఇది ఓవర్సీస్‌లో హీరో కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ రికార్డుగా ప్రకటించారు. అంతేకాదు ఓ భారతీయ చిత్రానికి ఇంత వేగంగా ఇంతటి స్థాయిలో బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి అని మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌లో తెలిపారు. ఇక తమ హీరో ఖాతాలో నమోదైన మరో రికార్డును తెలుసుకుని అల్లు అర్జున్‌ అభిమానులు సంతోషపడుతున్నారు. 

రిలీజ్‌కు ముందే ఇన్ని రికార్డులు క్రియేట్‌ అవుతుండటం పట్ల వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల తరువాత మరిన్ని రికార్డులు పుష్పరాజ్‌ బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్నాడని బన్నీ ఫ్యాన్స్‌ సంబరాల్లో ఉన్నారు. 



Pushpa 2
Allu Arjun
Sukumar
Rashmika Mandanna
Pushpa the rule
Allu arjun new records
Pushpa latest news
Tollywood
Cinema
  • Loading...

More Telugu News