Shiva Reddy: ఒక పెద్ద ఆర్టిస్టు వలన నాకు అవకాశాలు రాలేదు!: శివారెడ్డి

Shiva Reddy Interview

  • 'పిట్టలదొర'తో ఎంట్రీ ఇచ్చిన శివారెడ్డి 
  • మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు
  • సినిమాలు తగ్గడంపై ఆవేదన
  • పెద్ద ఆర్టిస్ట్ ప్రవర్తన గురించిన ప్రస్తావన  
  • ఆ రోజంతా ఏడ్చానని వెల్లడి


శివారెడ్డి .. మంచి నటుడు .. మిమిక్రీ ఆర్టిస్ట్. ఒకానొక దశలో ఆయన రెండు పడవల ప్రయాణం చాలా ఈజీగా చేశారు. కానీ ఆ తరువాత సినిమాలలో అవకాశాలను కోల్పోతూ వచ్చారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివారెడ్డి మాట్లాడుతూ, తనకి అవకాశాలు తగ్గడానికి గల కారణాన్ని ప్రస్తావించాడు.

"మా ఫ్యామిలీ పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకోలేక, నేను మిమిక్రీ ఆర్టిస్టుగా .. నటుడిగా మారాలనుకున్నాను. సానా యాదిరెడ్డిగారు 'పిట్టలదొర' సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత వరుస సినిమాలలో అవకాశాలు రావడం మొదలైంది. ఒక వైపున సినిమాలతో .. మరో వైపున స్టేజ్ షోస్ తో బిజీగా ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఒక సంఘటన జరిగింది" అని అన్నాడు. 

" ఒక రోజున నేను చెన్నైలో షూటింగులో ఉన్నాను. మేకప్ చేసుకుని సీన్ కి రెడీ అవుతున్నాను. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద ఆర్టిస్ట్, నేను ఆ ప్రాజెక్టులో ఉంటే తాను చేయనని చెప్పాడు. దాంతో నన్ను ఆ సినిమాలో నుంచి తీసేశారు. దాంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే వరకూ ఏడుస్తూనే ఉన్నాను. ఇంత టాలెంట్ ఉన్న నాకు అవకాశాలు రావడం లేదంటే, నా వెనుక పాలిటిక్స్ జరిగాయనే అనుకోవాలి" అని చెప్పాడు.  

Shiva Reddy
Pittala Dora
Sana Yadiredy
  • Loading...

More Telugu News