Punch Prabhakar: పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు

Case filed on Punch Prabhakar

  • చంద్రబాబు, పవన్ లను దుర్భాషలాడుతూ వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్
  • సైబర్ క్రైమ్ పోలీసులకు డి.రాజు అనే వ్యక్తి ఫిర్యాదు
  • బాయి జయంతి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన ఎన్నారై పంచ్ ప్రభాకర్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పంచ్ ప్రభాకర్ అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. వైసీపీ సానుభూతిపరుడైన ఈయన 'పంచ్ ప్రభాకర్' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. మొగల్రాజపురంకు చెందిన డి.రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈయనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరోవైపు వి.బాయిజయంతి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదయింది. సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వారిని దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారంటూ మొగల్రాజపురంకు చెందిన సాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Punch Prabhakar
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News