BR Naidu: టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన బీఆర్ నాయుడు.. కొలువుదీరిన కొత్త పాలకమండలి!

BR Naidu takes oath as TTD Chairman

  • బీఆర్ నాయుడుతో ప్రమాణస్వీకారం చేయించిన టీటీడీ ఈవో
  • ప్రమాణం చేసిన మరో 16 మంది సభ్యులు
  • సాయంత్రం మీడియాతో సమావేశం కానున్న కొత్త పాలకమండలి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది టీటీడీ పాలకమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలో ఉన్న బంగారు వాకిలిలో వీరి చేత టీటీడీ ఈవో శ్యామలరావు ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేయించారు. 

ప్రమాణస్వీకారం అనంతరం బీఆర్ నాయుడు, ఇతర సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు, వీరితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎండోమెంట్స్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలను స్వీకరించారు. 

బాధ్యతలను స్వీకరించిన అనంతరం వీరందరూ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అర్చకులు శేష వస్త్రాలను కప్పి వేదాశీర్వచనం పలికారు. ఈ సాయంత్రం అన్నమయ్య భవనంలో కొత్త పాలకమండలి మీడియా సమావేశంలో పాల్గొననుంది.

BR Naidu
TTD
  • Loading...

More Telugu News