Uttam Kumar Reddy: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana Government good news to Ration Card holders

  • వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని వెల్లడి
  • సన్నధాన్యంపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని వ్యాఖ్య
  • ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని పిలుపు

రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తెలంగాణవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇది దేశ చరిత్రలో ఓ మైలురాయి అన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

దాన్యం సేకరణ కేంద్రాల్లో ఎలాంటి గందరగోళం ఉత్పన్నం కాకుండా... రైతులకు మద్దతివ్వడానికి ప్రజాప్రతినిధులు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలన్నారు. సన్న ధాన్యంపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు. ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఈరోజు సాయంత్రం ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Uttam Kumar Reddy
Telangana
Congress
  • Loading...

More Telugu News