Pruthvi: ఓటీటీ తెరపైకి ఉత్కంఠను పెంచే 'పోతుగడ్డ'

Pothu Gadda Movie Update

  • ఈటీవీ విన్ ట్రాక్ పైకి 'పోతుగడ్డ'
  • సస్పెన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా
  • టీజర్ తో ఉత్కంఠను రేపుతున్న కంటెంట్ 
  • ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్


ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఒక సినిమా రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'పోతుగడ్డ'. సస్పెన్స్ తో కూడిన యాక్షన్ డ్రామా ఇది. నేరుగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. శరత్ చంద్ర - అనుపమ చంద్ర నిర్మించిన ఈ సినిమాకి రక్ష వీరమ్ దర్శకత్వం వహించాడు. మార్కస్ సంగీతాన్ని సమకూర్చాడు. 

పృథ్వీ .. విస్మయశ్రీ .. శత్రు .. ఆడుకాలం నరేన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి రీసెంటుగా టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఒక వైపున ప్రేమ యుద్ధం .. మరో వైపున రాజకీయ యుద్ధం అంటూ టీజర్ తోనే ఆసక్తిని రేకెత్తించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెప్పారు. 

ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలు తెరపైకి ఎక్కువగా వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యం అనేది చిన్న సినిమాలకు ఒక వరంగా మారింది. ఈ తరహా కథల్లో ఏ మాత్రం కంటెంట్ ఉన్నా మంచి ఆదరణ పొందుతున్నాయి. 'పోతుగడ్డ'లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. 

Pruthvi
Vismaya
Shatru
Adukalam Naren
  • Loading...

More Telugu News