Metro: హైదరాబాద్ లో నిలిచిన మెట్రో రైళ్లు.. సాంకేతిక లోపమే కారణం.. వీడియో ఇదిగో!

Metro Rail In Hyderabad Stopped

--


హైదరాబాద్ లో సోమవారం ఉదయం మెట్రో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రైళ్లు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 నిమిషాలుగా మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు ఈ పరిణామంతో అవస్థ పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్- మియాపూర్ రూట్లలో పరుగులు తీసే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

Metro
Hyderabad
Metro Rail
Trains Stopped
Nagole
miyapur

More Telugu News