Salman Khan: 'సికందర్' షూటింగ్ కోసం హైదరాబాదులో ల్యాండైన సల్మాన్ ఖాన్

Salman Khan arrives Hyderabad for Sikandar shooting

  • సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా 'సికందర్'
  • ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చిత్రం
  • హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగుకు సల్మాన్ ఖాన్

గతేడాది కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్-3 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా 'సికందర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సల్మాన్ ఖాన్ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. 

నగరంలోని సుప్రసిద్ధ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఓ భారీ సీన్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీన్ లో సల్మాన్ ఖాన్ సహా ఇతర కీలక తారాగణం పాల్గొననున్నారు. ఇదే ఫలక్ నుమా ప్యాలెస్ లో 2014లో సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం జరగడం తెలిసిందే. 

కాగా, సికందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సౌత్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. పుష్పతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక... బాలీవుడ్ చిత్రాలతో బిజీ అయింది. సల్మాన్ సరసన తొలిసారి నటిస్తోంది. సికందర్ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

కాగా, తన సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడం, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో... సల్మాన్ ఖాన్ చాలా తక్కువగానే బయట కనిపిస్తున్నాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగులకు హాజరవుతున్నాడు.

Salman Khan
Sikandar
Shooting
Hyderabad
Bollywood
  • Loading...

More Telugu News