Narne nithiin: ఘనంగా ఎన్టీఆర్‌ బావమరిది, 'మ్యాడ్‌' హీరో నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌

NTRs brother in law Mad Hero Narne Nithiins engagement

ఘనంగా జరిగిన నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ 
అత్యంత ఆత్మీయుల మధ్య నిశ్చితార్థం 
త్వరలోనే పెళ్లి డేట్‌ నిర్ణయం


'మ్యాడ్‌' చిత్రంతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్‌ బావమరిది (ఎన్టీఆర్‌ అర్ధాంగి ప్రణీత సోదరుడు) నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ శివాని తాళ్ళూరితో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ కుటుంబంతో పాటు కళ్యాణ్‌రామ్‌ కూడా ఫ్యామిలీతో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

వీరితో పాటు హీరో వెంకటేష్‌, నిర్మాత చినబాబు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మ్యాడ్‌ చిత్రంతో హీరోగా రంగ ప్రవేశం చేసిన నితిన్‌ నటించిన ఆయ్‌ కూడా ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను నమోదు చేసుకుంది. నితిన్‌ నార్నే నటించిన మ్యాడ్‌-2 చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్‌ వివాహం కూడా త్వరలోనే జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే నిర్ణయిస్తారని తెలిసింది.

Narne nithiin
Ntr
Tollywood
Cinema
Shivani talluri

More Telugu News