: ప్రేమను కొలిచే 'అప్లికేషన్' వచ్చేసింది
కాదేదీ కవితకనర్హం అని మహాకవి అంటే.. ఆహా అనుకున్నాం! కాదేదీ కొలిచేందుకు అనర్హం అని ఫిలిప్ప్ సంస్థ అంటుంటే ఏమనగలం.. ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం తప్ప! మనుషుల మధ్య నెలకొనే అవ్యాజమైన అనుభూతి ప్రేమను కూడా కొలవచ్చంటోంది ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫిలిప్స్ సంస్థ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తాను రూపొందించిన ఏప్స్ (అప్లికేషన్) ప్రేమను కచ్చితంగా లెక్కిస్తుందని ఫిలిప్ప్ ఢంకా బజాయిస్తోంది.
అయితే, ఈ అప్లికేషన్ ను స్మార్ట్ ఫోన్ సాయంతో
వినియోగించాల్సి ఉంటుంది. ఎవరి ప్రేమను అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ
వ్యక్తి కి అభిముఖంగా నిలుచుని స్మార్ట్ ఫోన్ ను కొంచెం సేపు ఫోకస్ చేయాలి.
హృదయ స్పందన, శ్వాసలో హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రేమను లెక్కిస్తుందట. ఈ నూతన
అప్లికేషన్ ను అభివృద్ధి చేసిన విన్సెంట్ జెన్నీ తన ఉత్పాదన 99 శాతం
కచ్చితమైన ఫలితాలను ఇస్తుందంటున్నాడు.