AP Assembly Session: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ap assembly sessions will start from 11th november 2024

  • తొలి రోజు గవర్నర్ ప్రసంగం
  • పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
  • 11 వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌తో పాటు ప్రభుత్వం ఇతర బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు.

AP Assembly Session
Amaravati
ap news
  • Loading...

More Telugu News