Roja: తొక్కిపట్టి నార తీస్తానన్న పవన్ ఇప్పటిదాకా ఎంతమందికి తీశారు?: రోజా

Roja take a dig at Pawan Kalyan

  • వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిందన్న రోజా
  • బాలిక తల్లిదండ్రులకు పరామర్శ
  • చంద్రబాబు, పవన్, అనిత సిగ్గుపడాలంటూ విమర్శలు 

కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిందంటూ రోజా మండిపడ్డారు. ఇవాళ ఆమె బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే నేరస్తులు తెగబడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని అన్నారు. 

ఆడవాళ్లను ఎవరైనా బాధపెడితే తొక్కిపట్టి నారతీస్తానని పవన్ గతంలో అన్నారని, ఇప్పటిదాకా 100 మంది ఆడబిడ్డలు ప్రాణాలు వదిలితే, ఎంతమందికి పవన్ నారతీశారో చెప్పాలని మండిపడ్డారు. 

చేతిలో అధికారం ఉండి కూడా, నేరగాళ్లలో భయం కల్పించలేకపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చిందని, బెల్టు షాపులు కూడా తయారయ్యాయని... మద్యం మత్తులోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. 

Roja
Pawan Kalyan
Chandrababu
Vangalapudi Anitha
YSRCP
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News