Mrunal Thakur: అభిమానికి క్లాస్ పీకి, ఆపై సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur said sorry to a fan

  • పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మృణాల్ ఠాకూర్
  • ఎడిట్ చేసిన ఫొటో పోస్టు చేసిన అభిమాని
  • ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా అంటూ మృణాల్ ఆగ్రహం

తెలుగులో పలు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ఇటీవల కల్కి ఏడీ 2898 చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ద్వారా  అలరించింది. తాజాగా, తనను మనస్థాపానికి గురిచేసిన ఓ అంశాన్ని అమ్మడు అందరితో పంచుకుంది. 

ఇంతకీ ఆమెను వేదనకు గురిచేసిన అంశం ఏమిటంటే... ఆమె ఫొటోను ఒక నెటిజన్ ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. తన పక్కన మృణాల్ ఠాకూర్ ఉన్నట్టు ఫొటోను ఎడిట్ చేశాడు. మొదట్లో ఆ ఫొటో పట్ల ఈ అందాల భామ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పోనీలే... అభిమాని ముచ్చటపడ్డాడు కదా అని ఊరుకుంది. అయితే, సోషల్ మీడియాలో అతడి ప్రొఫైల్ చూశాక మండిపడింది. 

అతడి ప్రొఫైల్ లో చాలామంది హీరోయిన్ల పక్కన అతడు ఉన్నట్టుగా ఎడిట్ చేసిన ఫొటోలు దర్శనమిచ్చాయి. దాంతో, మృణాల్ కు కోపం వచ్చింది. తన అనుమతి లేకుండా ఇష్టంవచ్చినట్టు తన ఫొటోను మార్చడం ఏంటని ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్మిషన్ తీసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? అంటూ అతడికి క్లాస్ తీసుకుంది. 

ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ మనసు మార్చుకుని, అతడికి సారీ చెప్పింది. అంతేకాదు, తన ఫొటోను ఎడిట్ చేశాడన్న కారణంతో అతడిని ఎవరూ ట్రోల్ చేయవద్దని కూడా ఇతర అభిమానులకు సూచించింది.

Mrunal Thakur
Fan
Apology
Edited Photo
  • Loading...

More Telugu News