G. Kishan Reddy: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!

Union minister Kishan Reddy met Megastar Chiranjeevi

  • చిరంజీవి నివాసానికి విచ్చేసిన కిషన్ రెడ్డి
  • మిత్రుడికి సాదర స్వాగతం పలికిన చిరంజీవి
  • పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్న చిరంజీవి, కిషన్ రెడ్డి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. తాజాగా, కిషన్ రెడ్డి హైదరాబాదులో చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఇరువురు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తన నివాసానికి వచ్చిన సందర్భంగా కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి చిరంజీవి సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం, మిత్రులిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. 

చిరంజీవి గతంలో యూపీఏ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డి కూడా గత టర్మ్ లో టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది చిరంజీవిని కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించగా... చిరంజీవిని కిషన్ రెడ్డి స్పెషల్ గా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ వ్యూస్ పరంగా దూసుకుపోయింది.

కాగా, నేడు చిరంజీవితో భేటీపై కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. చిరంజీవి మంచి మనిషి అని కొనియాడారు. ఆయనను ఎప్పుడు కలిసినా సంతోషంగా ఉంటుందని తెలిపారు. సినీ రంగానికి అందిస్తున్న సేవలు, దాతృత్వ కార్యక్రమాలతో కోట్లాది మందికి చిరంజీవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని వివరించారు. 

G. Kishan Reddy
Chiranjeevi
Hyderabad
BJP
Telangana
NDA
  • Loading...

More Telugu News