Matka: 'మట్కా' టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపిన మెగాస్టార్

Megastar Chiranjeevo wishes Matka team all the best

  • వరుణ్ తేజ్ హీరోగా మట్కా
  • కరుణ కుమార్ దర్శకత్వంలో చిత్రం
  • నవంబరు 14న గ్రాండ్ రిలీజ్
  • నేడు అఫీషియల్ ట్రైలర్ విడుదల 

వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మట్కా. ఈ చిత్రం నుంచి నేడు అఫిషియల్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పై పొగడ్తల జల్లు కురిపించారు. 

"విభిన్నమైన కథలు, విలక్షణమైన స్క్రిప్టుల పట్ల నీ తపన చూస్తుంటే గర్వంగా ఉంది. నీ ప్రతిభ ఎప్పటికప్పుడు అద్భుతం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మట్కా ట్రైలర్ చూస్తుంటే అదిరిపోయింది! మట్కా నవంబరు 14న థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, యావత్ చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Matka
Trailer
Chiranjeevi
Varun Tej
Karuna Kumar
Tollywood

More Telugu News