Nara Lokesh: అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి లోకేశ్ పెట్టుబడుల యాత్ర
![Minister Nara Lokesh America Tour Grand Success](https://imgd.ap7am.com/thumbnail/cr-20241102tn6725a137136dd.jpg)
- వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుస భేటీలు
- పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేశ్ సక్సెస్
- మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు
- లోకేశ్ పర్యటన విజయవంతం కావడం పట్ల ఏపీ పారిశ్రామిక వర్గాల హర్షం
అమెరికాలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేశ్ సక్సెస్ అయ్యారు.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ ను లోకేశ్ ఆవిష్కరించడం జరిగింది. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. కాగా, ఆయన భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్‌లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతం కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.