Raj Pakala: జన్వాడ ఫాంహౌస్ కేసు: ముగిసిన రాజ్ పాకాల విచారణ

Police questions Raj Pakala

  • నేడు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన రాజ్ పాకాల
  • అక్రమ మద్యం వినియోగం కేసులో విచారించిన పోలీసులు
  • మూడు గంటల పాటు ప్రశ్నించిన వైనం

జన్వాడ ఫాంహౌస్ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను ఎక్సైజ్ పోలీసులు నేడు మూడు గంటల పాటు ప్రశ్నించారు. ఆయనపై విచారణ ముగిసింది. ఇవాళ రాజ్ పాకాల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ సమక్షంలో విచారించారు. 

అక్రమ మద్యం వినియోగం కేసులో ఏ2గా ఉన్న రాజ్ పాకాలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న నాగేశ్వర్ రెడ్డిని సాయంత్రం 5 గంటల నుంచి ప్రశ్నించారు. 

విచారణ సందర్భంగా ఇద్దరినీ పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు? ఫాంహౌస్ కు ఎలా తీసుకువచ్చారు? ఎక్కడెక్కడికి మద్యం సరఫరా చేశారు? అనే అంశాలపై ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ పీఎస్ నుంచి వెలుపలికి వచ్చిన రాజ్ పాకాల... మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. 

Raj Pakala
Janwada Farm House
Liquor
Hyderabad
  • Loading...

More Telugu News