BR Naidu: బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంపై నాగబాబు స్పందన

Nagababu wishes BR Naidu on being appointed as TTD Chairman
  • టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు
  • శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు
  • టీటీడీ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్ష
టీవీ5 న్యూస్ చానల్ అధినేత బీఆర్ నాయుడుకు ఏపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. హిందూ ధర్మాన్ని, శ్రీనివాసుడిని అమితంగా కొలిచే టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి రావడం శుభసూచకం అని పేర్కొన్నారు. 

సరైన వ్యక్తికి సరైన సమయంలో సరైన గౌరవం దక్కడం చాలా సంతోషం కలిగిస్తోందని నాగబాబు తెలిపారు. గతంలో ఉన్న అవకతవకలను సరిచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను బీఆర్ నాయుడు మరింత మెరుగుపర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

ఇక, జనసేన పార్టీ తరఫున టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎన్నికైన ఆనంద్ సాయి, అనుగోలు రంగశ్రీ, మహేందర్ రెడ్డికి, టీటీడీ సభ్యులుగా ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
BR Naidu
TTD Chairman
Nagababu
TV5
Janasena
Andhra Pradesh

More Telugu News