Chandrababu: ఈదుపురంలో ఉచిత గ్యాస్ అందించి... స్టవ్ వెలిగించి... టీ తయారుచేసి తాగిన చంద్రబాబు

Chandrababu distributes free gas cylinder to a woman

  • శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం
  • శాంతమ్మ అనే లబ్ధిదారుకు స్వయంగా ఫ్రీ సిలిండర్ అందించిన చంద్రబాబు

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో జరిగిన కార్యక్రమంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. 

లబ్ధిదారు శాంతమ్మ ఇంటికెళ్లి స్వయంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందించారు. అంతేకాదు, ఉచిత సిలిండర్ ను బిగించి, స్టవ్ కూడా వెలిగించారు. చంద్రబాబు అంతటితో ఆగలేదు... తానే టీ తయారుచేసి తాగారు. 

ఈదుపురం పర్యటన సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభకు హాజరయ్యారు.

Chandrababu
Free Gas Cylinder
Edupuram
Srikakulam District
TDP-JanaSena-BJP Alliance

More Telugu News