Hardik Panya: ఐదుగురిని రిటెన్షన్ చేసుకున్న ముంబై ఇండియన్స్... స్పందించిన హర్దిక్ పాండ్యా
- తన ప్రయాణం ఇక్కడే మొదలైందన్న హార్దిక్ పాండ్యా
- తనను రిటైన్ చేసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్య
- ప్రతి ఏడాది ప్రత్యేకమైనదే... కానీ ఈసారి మరింత ఆనందంగా ఉందన్న పాండ్యా
ముంబై ఇండియన్స్ జట్టు తనతో పాటు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంపై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను ముంబై ఇండియన్స్ జట్టు రిటైన్ చేసుకుంది.
ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా స్పందిస్తూ... తన ప్రయాణం ఇక్కడే మొదలైందని, తన జీవితంలో సాధించినవన్నీ ముంబై ఇండియన్స్‌లో భాగమేనన్నాడు. తనను రిటైన్ చేసుకోవడం సంతోషకరమన్నాడు. యాజమాన్యం నుంచి తాను ఎంతో ప్రేమను తిరిగి పొందానన్నాడు. ప్రతి సంవత్సరం తనకు ప్రత్యేకమైనదేననీ... కానీ ఈ జట్టుకు మళ్లీ ఆడే అవకాశం లభించినందుకు మరింత ఆనందంగా ఉందన్నాడు.
2013, 2015, 2017, 2019, 2020లలో తాము ఐదుగురం ఓ బృందంగా జట్టుకు ప్రాతినిధ్యం వహించామని గుర్తు చేశాడు. 2025లో తాము మరింత బలంగా తిరిగి వస్తామన్నాడు. తమ ఐదుగురికి ఈ జట్టులో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, తాము చేతికి ఉన్న ఐదు వేళ్లలాంటి వారమన్నాడు. ఐదు వేళ్లలా విభిన్న వ్యక్తులమైనప్పటికీ పిడికిలి బిగించినట్లుగా కలిసి ఉంటామని పేర్కొన్నాడు. తమ మధ్య సోదర భావం, స్నేహ భావం ఎప్పటికీ కొనసాగుతుందన్నాడు.