Keir Starmer: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

UK prime minister Keir Starmer wishes people on Diwali

  • ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న భారతీయులు
  • హ్యాపీ దీపావళి అంటూ స్పందించిన బ్రిటన్ ప్రధాని
  • అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష 

భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ప్రముఖమైన స్థానం ఉంది. ఇంటిల్లిపాదీ బాణసంచా కాల్చుతూ సంతోషంగా వేడుకలు జరుపుకోవడం దీపావళి విశిష్టత. భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

"హ్యాపీ దీపావళి... బ్రిటన్ వ్యాప్తంగా దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు... మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఐకమత్యంతో ఉండడానికి, సకల ఐశ్వర్యాలకు స్వాగతం పలకడానికి, చీకటిని పారదోలే వెలుగుపై దృష్టి నిలిపేందుకు ఇదొక సందర్భం అని బ్రిటన్ ప్రధాని తన ట్వీట్ లో దీపావళిని అభివర్ణించారు.

Keir Starmer
Diwali
Prime Minister
UK
  • Loading...

More Telugu News