Narendra Modi: అభివృద్ధి లక్ష్యంగా వేసే అడుగులకు సైనికులే రక్షకులు: ప్రధాని మోదీ

PM Modi we trust determination of our soldiers
  • అంగుళం భూమి విషయంలోనూ రాజీపడేది లేదన్న ప్రధాని
  • సైనికులపై దేశ ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని వ్యాఖ్య
  • సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్న మోదీ
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, ఆ కలలకు సైనికులే రక్షకులని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడేది లేదన్నారు. మన సైనికులపై దేశ ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు.

భారత్ ఎప్పుడూ తన శత్రువుల మాటలను వినదని... సైనికుల దృఢ నిశ్చయాన్ని మాత్రమే విశ్వసిస్తుందన్నారు. సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరుగా ఉన్నప్పటికీ త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తిసామర్థ్యాలు పెరుగుతాయన్నారు.
Narendra Modi
BJP
Soldiers
India

More Telugu News